close
Choose your channels

బాలయ్య 'రైతు' ఎప్పుడంటే....

Wednesday, October 5, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌న 100వ చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 101వ చిత్రం రైతు సినిమాను చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై రూపొందనున్న ఈ సినిమా డిసెంబ‌ర్‌లో ప్రారంభించ‌నున్నారు. ఒక‌వైపు సినిమా పూర్తి చేస్తూనే మ‌రో సినిమాలో బాల‌కృష్ణ న‌టించ‌డానికి రెడీ అవుతుండటం ఒకటైతే, ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రో వైపు సినిమాలను బ్యాలెన్స్‌డ్‌గా చేయ‌డం కూడా బాల‌య్యకే చెల్లింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.