close
Choose your channels

కొత్త దర్శకుడుతో బాలయ్య...

Saturday, April 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో వంద సినిమాల‌ను పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 101వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ ఏ ద‌ర్శ‌కుడుతో సినిమా చేస్తాడోన‌ని అనుకుంటున్నారు.
త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నా, తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ కొత్త ద‌ర్శ‌కుడు బాల‌కృష్ణ‌ను క‌లిసి ఓ లైన్ వినిపించాడ‌ట‌. లైన్ బాల‌య్య‌కు న‌చ్చ‌డంతో స్క్రిప్ట్ త‌యారు చేయ‌మ‌ని అన్నాడ‌ట‌. స్క్రిప్ట్ అనుకున్న విధంగా వ‌స్తే, కొత్త ద‌ర్శ‌కుడితోనే బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రం ఉంటుంది. ఒక ప‌క్క రాజ‌కీయాల‌తో పాటు సినిమాలు చేయ‌డంలో కూడా బాల‌కృష్ణ దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.