close
Choose your channels

కాటమరాయుడు సెట్ లో బర్త్ డే సెలబ్రేషన్స్..!

Saturday, October 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ సోద‌రుడిగా శివ‌బాలాజీ న‌టిస్తున్నారు. అయితే...ఈనెల 14న శుక్ర‌వారం శివ‌బాలాజీ పుట్టిన‌రోజు. త‌న పుట్టిన‌రోజు నాడు కాట‌మ‌రాయుడు సెట్ లో ఏం జ‌రిగిందో శివ‌బాలాజీ త‌న ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేసారు.
పవన్ కళ్యాణ్ గారు లొకేషన్ కి వచ్చారు. వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సర్ అన్నాను. ఆ... శివా అనేంతలో, దర్శకులు డాలీ, పవన్ కళ్యాణ్ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్ అని చెప్పారు. వెంటనే పవన్ గారు నా భుజంమీద చెయ్యవేసి నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అని, ప్రొడ‌క్ష‌న్ అని పిలిచారు. వెంటనే ప్రొడ‌క్ష‌న్ ఛీఫ్ ఆయన ముందు హాజరు.. నాకొక కేక్ కావాలి.. పెద్దదిగా ఉండాలి... ఏం శివా బ్లాక్ ఫారెస్ట్ కేక్ నచ్చుతుందా? అన్నారు. నేను అలాగే కళ్ళప్పగించి ఎస్ సార్ అన్నాను. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్...నా భార్య మధుని పిలవచ్చా అని అడిగాను. పిల్లల్ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ ని కూడా రమ్మనవోయ్ అన్నారు. పవన్ గారి మానవత్వానికి , ఆయన చేసే కొన్ని వేల సేవలలో, నా పుట్టినరోజునాడు ఆయన నాకిచ్చిన విలువ చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం విలువకట్టలేని , మాటలలో చెప్పలేని మహదానుభూతి. నా జీవితంలో ఈ పుట్టిన‌రోజు ఓ మ‌ధురానుభూతిగా నిలిపిన డైరెక్ట‌ర్ డాలీ గార్కి ధ‌న్య‌వాదాలు అంటూ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ ఫోటోలు కూడా పోస్ట్ చేసారు శివ‌బాలాజీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.