close
Choose your channels

'చామంతి' ఏప్రిల్ లో విడుదల

Thursday, March 16, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చలపతి సినీ ఫిలింస్‌ పతాకంపై టి. చలపతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'చామంతి' చిత్రం సెన్సార్‌ కాబడి విడుదలకు సిద్దమవుతోంది. నూతన తారాగణంతో పూర్తి స్థాయి రొమాంటిక్‌ హారర్‌ కథాంశంతో ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, యువతను ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాత టి. చలపతి తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎవరూ ఊహించని పాత్రలో 'సంపూర్ణేష్‌ బాబు' ఈ చిత్రంలో అలరించనున్నారు. చామంతి ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారని, డిఫరెంట్‌ డెవిల్‌ని చూపించారని అందరూ ఫోన్‌ చేస్తున్నారు. అందరూ ఇలా ఈ చిత్రం గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.