close
Choose your channels

ఆగస్టు 14న వస్తున్న 'సినిమా చూపిస్త మావ'

Sunday, July 26, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉయ్యాల జంపాల` జంట రాజ్‌తరుణ్‌-అవికాగోర్‌ నటిస్తున్న సినిమా చూపిస్త మావ` చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌-ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)- రూపేష్‌ డి.గోహిల్‌- జి.సునీత నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు మధుర ఆడియో` ద్వారా విడుదలై` సినీ సంగీత ప్రియులను విశేషంగా అరిస్తున్నాయి. శేఖర్‌చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సినిమా విడుదల తేదీని ప్రకటించేందుకు సంస్థ కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో` నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్‌, రాజశేఖర్‌రెడ్డి, చిత్ర దర్శకుడు త్రినాధరావు నక్కినతోపాటు ఈ చిత్రం ద్వారా డైలాగ్‌ రైటర్‌గా ఇంట్రడ్యూస్‌ అవుతున్న ప్రసన్నకుమార్‌ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.

శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొంది, మధుర ఆడియో ద్వారా విడుదలైన సినిమా చూపిస్త మావ` పాటలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడు ఈ సినిమాపై మొదలైన క్యూరియాసిటీ` ఆడియో రిలీజ్‌ తర్వాత క్రేజ్‌గా మారిందని, సినిమాపై పెరిగిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని, అవుట్‌పుట్‌కు మరిన్ని మెరుగు దిద్ది- హంగు అద్దుతున్నామని.. త్వరలోనే సెన్సార్‌ చేయించి, ఆగస్టు 14న సినిమా చూపిస్త మావ` చిత్రాన్ని విడుద చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు.

బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌-దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్‌(గోపి)-రూపేష్‌ డి.గోహిల్‌-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.