close
Choose your channels

చ‌ర‌ణ్ జ‌గ‌దేక‌వీరుడు కి డైరెక్ట‌ర్ దొరికాడు..!

Wednesday, October 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్ లో రూపొందిన చిత్రం జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక‌సుంద‌రి. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఇప్పుడు మెగాస్టార్ వార‌స‌డు రామ్ చ‌ర‌ణ్ తో అశ్వ‌నీద‌త్ జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి చిత్రాన్ని ప్ర‌జెంట్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేసి రీమేక్ చేయాలి అనుకుంటున్నారు. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ ప్రాజెక్ట్ గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే...లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే..

ఈ భారీ చిత్రానికి డైరెక్ట‌ర్ క్రిష్ అయితే బాగా హ్యాండిల్ చేయ‌గ‌ల‌డ‌ని ద‌త్ భావించార‌ట‌. ఈ విష‌యాన్ని చిరంజీవితో చెబితే ఆయ‌న కూడా హ్యాపీగా ఓకే చెప్పార‌ని స‌మాచారం. ఈ మూవీకి జ‌గ‌దేక‌వీరుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. సుకుమార్ మూవీ త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి..ఎప్ప‌టికి సెట్స్ పైకి వెళుతుందో...? అతిలోక సుంద‌రిగా ఎవ‌ర్ని సెలెక్ట్ చేస్తారో..? చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.