close
Choose your channels

గోపిచంద్ మూవీ టైటిల్...

Friday, October 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ప్రస్తుతం సక్సెస్ ఊపుతో ఉన్నాడు. లౌక్యం` వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సక్సెస్ తర్వాత భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రంలో నటిస్తున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం` తో సక్సెస్ కొట్టిన ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.

ప్రస్తుతం సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనా నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సౌఖ్యం అనే టైటిల్ ను ఖరారు చేశారట. గతంలో గోపిచంద్ చిత్రాలు లక్ష్యం, శౌర్యం, శంఖం, లౌఖ్యం తరహాలో ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ సౌఖ్యం అనే టైటిల్ ను ఖరారు చేశారట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.