close
Choose your channels

విభిన్న ప్రేమకథ గా 'గువ్వ గోరింక'

Friday, February 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ్యోతిలక్ష్మీ` ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్‌వ‌ర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, దళం `జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రానికి గువ్వ గోరింక‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను నేడు విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు చిత్ర విశేషాలు తెలియ‌జేస్తూ విభిన్న మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఇద్ద‌రు ప్రేమికుల క‌థ ఇది. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ను ప్రేమికుల రోజున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.

ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్‌, అన్న‌వ‌రం, వ‌రంగ‌ల్‌ల‌లో జ‌రిగిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ పూర్త‌యింది. కొత్త త‌ర‌హా సినిమాల్ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు వినూత్న అనుభూతిని పంచుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది` అని తెలిపారు. చైతన్య, మధుమిత, పెళ్లిచూపులు ప్రియదర్శి, ఈటీవీ ప్రభాకర్, ఫిష్ వెంకట్, సత్య ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, డీఓపీ: మైల్స్ రంగస్వామి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.