close
Choose your channels

బాలయ్య కోసం భారీ సెట్..

Tuesday, April 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. రీసెంట్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం కోటిన్న‌ర రూపాయ‌ల‌తో భారీ మార్కెట్ సెట్‌ను వేశార‌ట‌. ఇందులో హీరో, హీరోయిన్‌పై కీల‌క స‌న్నివేశాల‌తో పాటు కొన్ని యాక్ష‌న్స్ సీన్స్‌ను కూడా చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ఉంటుంది.

భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌య్య గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. బాల‌య్య‌ను స‌రికొత్త‌గా పూరి ప్రెజెంట్ చేయ‌నున్నాడట‌. బాల‌య్య‌, పూరి వంటి క్రేజీ కాంబినేష‌న్‌లో రానున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.