close
Choose your channels

జో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు...టైటిల్...

Wednesday, March 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విల‌క్ష‌ణ కాన్సెప్ట్‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు బాల‌. బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు త‌మిళం నుండి తెలుగులోకి అనువాద‌మైన శివ‌పుత్రుడు, వాడు-వీడు, నేనే దేవుణ్ణి చిత్రాలు మంచి ఆద‌ర‌ణ పొందాయి. ఇప్పుడు ఈ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక న‌టిస్తుంది. హీరోయిన్స్‌ను డీ గ్లామ‌ర్ రోల్స్‌లో చూపించే బాల అస‌లు జ్యోతిక‌ను ఎలా చూపిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ బాల ఈసారి స్టైల్ మార్చినట్లు క‌న‌ప‌డుతుంది. జ్యోతిక కొత్త లుక్‌ను విడుద‌ల చేశారు.

`నాచియార్‌` అనే టైటిల్‌తో ఈ సినిమా రానుంది. నాచియార్ అంటే మ‌న తెలుగులో మ‌నం స్త్రీల‌ను రెడ్డెమ్మ‌, నాయుడమ్మ అనే పిలుస్తుంటాం..క‌దా..అలాగే త‌మిళంలో నాచియార్ అని అంటుంటారు. ఈ నాచియార్ సినిమాను హీరో సూర్య‌నే త‌న స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్మెంట్‌లో నిర్మించ‌బోతున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.