close
Choose your channels

విక్రమ్ సరసన కమల్ తనయ?

Monday, July 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మ‌ల్‌హాస‌న్ ఇంట్లో క‌ళామ‌తల్లి కొలువై ఉంటుంద‌ని అంటారు. క‌మ‌ల్‌హాస‌న్ స్వ‌త‌హాగా న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, డ్యాన్స్ మాస్ట‌ర్‌.. ఒక‌టేంటి.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. ఆయ‌న పెద్ద త‌న‌య శ్రుతిహాస‌న్ అటు న‌ట‌న‌లోనూ, ఇటు సంగీతంలోనూ ఇప్ప‌టికే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. రెండో త‌న‌య అక్ష‌ర‌హాస‌న్ ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసింది. బాలీవుడ్‌లో అమితాబ్‌, ధ‌నుష్ న‌టించిన `ష‌మితాబ్‌`తో మంచి పేరు తెచ్చుకుంది. త‌మిళ్‌లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అజిత్ సినిమాకు సంత‌కం చేసింది.
ఆమె న‌టించిన `వివేగ‌మ్` వ‌చ్చే నెల్లో విడుద‌ల కానుంది. దాంతో పాటు ఆమె తాజాగా విక్ర‌మ్ సినిమాకు కూడా సంత‌కం చేసింది. విక్ర‌మ్ అన‌గానే అపరిచితుడు ఫేమ్ విక్ర‌మ్ అనుకునేరు. కాదండోయ్‌.. విక్ర‌మ్ ర‌విచంద్ర‌న్ క‌న్న‌డ న‌టుడు. క‌న్న‌డ స్టార్ హీరో ర‌విచంద్ర‌న్ త‌న‌యుడు. విక్ర‌మ్ తొలి సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ్‌లో కూడా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ సినిమాలో నాయిక‌గా అక్ష‌ర‌ను ఎంపిక చేశారు. సో అటు ఉత్త‌రాది సినిమాల‌తో పాటు నెమ్మ‌నెమ్మ‌దిగా ద‌క్షిణాది చిత్రాల్లో కూడా త‌న స‌త్తా చూప‌డానికి ప్రిపేర్ అవుతోంద‌న్న‌మాట అక్ష‌ర‌హాస‌న్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.