close
Choose your channels

కాట‌మ‌రాయుడుకు ముహుర్తం ఖ‌రారు..!

Thursday, September 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించ‌నున్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

దీంతో అస‌లు ఈ సినిమా ఉందా..? లేదా..? అనే అనుమానాలు కూడా మొద‌ల‌య్యాయి. ఈ అనుమానాలు, ప్ర‌చారాల‌కు తెర దించుతూ ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ను ఈ నెల 20 నుంచి ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ నెల 24 నుంచి ఈ షూటింగ్ లో పాల్గొంటారని స‌మాచారం. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థగా రూపొందుతున్న‌ ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.