close
Choose your channels

జ‌న‌తా గ్యారేజ్ మంచి సినిమా అంటూ అభినందిస్తుంటే షాక‌య్యాను - కొర‌టాల‌

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ రిలీజైన అన్నిచోట్లా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్ లో నిర్మాత న‌వీన్ య‌ర్నేని మాట్లాడుతూ...మా సినిమాకి అన్ని ఏరియాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక్క మెసేజ్ కూడా బాగుంది అని కాకుండా అంద‌రి నోట ఒక‌టే మాట బ్లాక్ బ‌ష్ట‌ర్ అంటున్నారు. ఫ‌స్ట్ డే చాలా ఏరియాల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు వేల స్ర్కీన్స్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసాం. ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్స్ లో శ్రీమంతుడు రికార్డ్ ను క్రాస్ చేసింది. బాహుబ‌లి త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన చిత్రంగా మా జ‌న‌తా గ్యారేజ్ నిలుస్తుంది అన్నారు.

డైరెక్ట‌ర్ కొర‌టాల శివ మాట్లాడుతూ...హీరోలు, ప్రొడ్యూస‌ర్స్, ఫ్రెండ్స్....అంద‌రూ చాలా మంచి సినిమా తీసారు అంటూ అభినందిస్తుంటే నిజంగా చెప్పాలంటే షాక‌య్యాను.ఎందుకంటే... ఇంత‌లా అభినందిస్తార‌ని ఊహించ‌లేదు. అద్భుత‌మైన ఈ రెస్పాన్స్ చూసి మా టీమ్ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. డిస్ట్రిబ్యూట‌ర్స్ ఫోన్ చేసి ఫ‌స్ట్ వీక్ సేఫ్ అయిపోతాం అని చెప్ప‌డం సంతోషంగా ఉంది. అలాగే మా ప్రొడ్యూస‌ర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్...ముఖ్యంగా లేడీస్ చాలా బాగుంది ఇలాంటి మంచి సినిమాలు మ‌రిన్ని తీయండి అని అభినందించారు. మైత్రీ మూవీస్ సంస్థ‌లో సెకండ్ బ్లాక్ బ‌ష్ట‌ర్, అలాగే నాకు హ్యాట్రిక్ కావ‌డంతో మ‌రింత బాధ్య‌త పెరిగింది. ప్ర‌స్తుతం ఈ స‌క్సెస్ ని ఎంజాయ్ చేయాల‌నుకుంటున్నాను. కేర‌ళ‌లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని మోహ‌న్ లాల్ గారు చెప్పారు. బ్లాక్ బ‌ష్ట‌ర్ అన‌డం క‌న్నా...ఈ మూవీని క్లాసిక్ అన‌డం క‌రెక్ట్ అనిపిస్తుంది అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.