close
Choose your channels

థ్రిల్ కలిగిస్తున్న‌ మ‌హిష్మ‌తి సామ్రాజ్యం..!

Tuesday, October 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రంలో మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని చూసి ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌య్యారు. ఇక బాహుబ‌లి 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇటీవ‌ల బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. అలాగే మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసారు. ఈ వీడియోను ఆన్ సెట్స్ ఆఫ్ బాహుబ‌లి 360 డిగ్రీల కోణంలో మ‌హిష్మ‌తి సామ్రాజ్యాన్ని చూసేలా వెసులుబాటు క‌ల్పించారు.

వ‌ర్చువ‌ల్ రియాల్టీ (విఆర్) ద్వారా ఈ వీడియోను చూసిన వాళ్లు తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. విఆర్ హెడ్ సెట్ పెట్టుకుని ఈ వీడియోను చూసిన గ్రామ‌స్ధులు సైతం థ్రిల్ ఫీల‌వుతున్నారు. అయితే...ఈ వీడియో చూస్తూ థ్రిల్ ఫీల‌వుతున్న గ్రామ‌స్ధులను వీడియో తీసి ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోను రాజ‌మౌళి, రానా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌డం విశేషం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.