close
Choose your channels

నాగచైతన్య సినిమాకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది....

Monday, September 12, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ నాగార్జున పెద్ద త‌న‌యుడు అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్రేమ‌మ్‌, సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు. కాగా త‌దుప‌రిగా నాని, సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని నాగార్జున స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 4 నుండి లాంచ‌నంగా ప్రారంభం కానుంద‌ట‌. నిన్నే పెళ్ళాడ‌తా త‌ర‌హాలో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.