close
Choose your channels

రవితేజ మూవీకి ముహుర్తం ఖరారు..!

Tuesday, September 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ రాజా ర‌వితేజ - స‌ర్ధార్ డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందనున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని చుట్టాల‌బ్బాయి నిర్మాత‌ల్లో ఒక‌రైన రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖ‌రారైంది. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 12 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. గ‌తంలో ర‌వితేజ‌, రాశీఖ‌న్నా క‌లిసి బెంగాల్ టైగ‌ర్ సినిమాలో న‌టించారు. ఇదిలా ఉంటే...ర‌వితేజ నూత‌న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరి తో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే..ఫ‌స్ట్ బాబీతో సినిమా చేసిన త‌ర్వాత నెక్ట్స్ విక్ర‌మ్ సిరితో సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.