close
Choose your channels

రీమేక్ లో సమంత, చైతు...?

Monday, September 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం టు స్టేట్స్‌` (2014) ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ కానుంది. హిందీలో కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ దగ్గర పలు చిత్రాలకు కో–డైరెక్టర్‌గా వ్యవహరించిన వెంకట్‌ కుంచెమ్‌.. వినాయక్‌ సహకారంతో ఈ చిత్రం తెలుగు రీమేక్‌ హక్కులు దక్కించుకున్నారు. పంపిణీ రంగంలో పలు విజయాలు చూసిన అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తుంది.

కాగా అర్జున్ కపూర్, అలియాభట్ పాత్రలను తెలుగులో నాగచైతన్య, సమంతలతో చేయించడానికి నిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. వారితో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు ఫిలింనగర్ లో తిరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాదిన నాగచైతన్యను సమంత పెళ్ళి చేసుకోనున్న సంగతి తెలిసిందే. అందువల్ల పరిమితంగానే సమంత సినిమాలను చేస్తుంది. కల్యాణ్ కృష్ణ చిత్రంలో చైతు సరసన సమంత హీరోయిన్ అనుకున్నారు కానీ చివరకు రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేరింది. మరి ఈ రీమేక్ లో నటించడానికి చైతు, సమంతలు అంగీకరిస్తారా..ఏమో చూద్దాం...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.