close
Choose your channels

చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో వ‌చ్చేస్తుంది..!

Monday, October 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ సంతోషంతో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. చైత‌న్య‌, గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ కాంబినేష‌న్లో రూపొందిన ఏమాయ చేసావే చిత్రం సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో...అదే కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

అయితే..ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ఇక‌ ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...త‌మిళ వెర్షెన్ కు సంబంధించిన ట్రైల‌ర్ రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్స్ కు శ్రీకారం చుట్టారు. ఆ ట్రైల‌ర్ ద్వారా న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్టు తెలియ‌చేసారు. మ‌రి...ప్రేమ‌మ్ తో సూప‌ర్ స‌క్సెస్ సాధించిన చైత‌న్య సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో ఆ స‌క్సెస్ కంటిన్యూ చేస్తార‌ని ఆశిద్దాం..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.