close
Choose your channels

'కేశవ' టీజర్ డేట్

Friday, March 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్వామిరారా నుండి త‌న స‌క్సెస్ యాత్ర‌ను కొన‌సాగిస్తున్న నిఖిల్ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌తో సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. రీసెంట్‌గా `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` సినిమాతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న నిఖిల్ తాజా చిత్రం 'కేశవ'ను అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తుంది.
'స్వామి రారా' వంటి హిట్ తర్వాత సుధీర్ వర్మ - నిఖిల్-రీతూవ‌ర్మ‌ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా టీజ‌ర్‌ను మార్చి 22న విడుద‌ల చేయ‌బోతున్నారు. అలాగే అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.