close
Choose your channels

నిఖిల్ మూవీ క్యాస్టింగ్ కాల్...

Saturday, July 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`స్వామిరారా`, `కార్తికేయ`, `ఎక్కడికి పోతావు చిన్నవాడా`, `కేశవ` వంటి వరుస విజయాలను సాధించిన యువ కథానాయకుడు నిఖిల్‌ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందనుంది. శరణ్‌ కొప్పిశెట్టి అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రానికి, దర్శకుడు సుధీర్‌ వర్మ స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా, మరో దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్‌ అందిస్తున్నారు.
యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందనుంది. సినిమాల్లో నటించాలనుకునే యువతీయువకులకు నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాలో అవకాశం కల్పిస్తుంది. అందులో భాగంగా ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఫోటోతో పాటు తమ పూర్తి వివరాలను సెలబ్-జోన్. కామ్ లో అప్ డేట్ చేసుకోవాలని నిర్మాణ సంస్థ తెలియజేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.