close
Choose your channels

ఎన్టీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదంట...

Tuesday, May 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్ప‌టి త‌రం హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా ఏదైనా ఒక‌సారి చూస్తే ప‌ట్టేస్తాడ‌ని అత‌నితో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు అంటుంటారు. ఇప్పుడు జై ల‌వ‌కుశ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు బాబీ కూడా అదే అభిప్రాయాన్ని వ్య‌క్తప‌రిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్‌తో 47 రోజుల పాటు షూటింగ్ చేశాను. కానీ ఇన్ని రోజుల్లో ఎన్టీఆర్ మ‌రో టేక్ చేద్దామ‌నే అవ‌కాశ‌మే ఇవ్వ‌డం లేదు అంటున్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.