close
Choose your channels

రుద్ర‌మ‌దేవికి పాజిటివ్ టాక్..

Thursday, October 8, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గుణ శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. దాదాపు 70 కోట్ల బ‌డ్జెట్ తో గుణ శేఖ‌ర్ తెర‌కెక్కించిన రుద్ర‌మ‌దేవి పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం రుద్రమదేవి కావ‌డం విశేషం. గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌, చాళుక్యవీరభద్రుడుగా దగ్గుబాటి రానా నటించిన రుద్ర‌మ‌దేవి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కింది.ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ చేస్తున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం రుద్ర‌మ‌దేవిలో ఫ‌స్టాఫ్ 45 మినిట్స్..సెకండాఫ్ లాస్ట్ 45 మినిట్స్ ఆడియోన్స్ థ్రిల్ ఫీల‌య్యాలా ఉంద‌ట‌. అలాగే రాణి రుద్ర‌మ‌గా అనుష్క న‌ట‌న‌, గోన గ‌న్నారెడ్డిగా బ‌న్ని ఫెర్ ఫార్మెన్స్, రానా, అనుష్క రొమాన్స్...గ్రాఫిక్స్ ...ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయ‌ట‌. ఈమాత్రం టాక్ వ‌స్తే చాలు..రుద్ర‌మ‌దేవికి భారీ విజ‌యం ఖాయం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.