close
Choose your channels

'సినీ మహల్ ' చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - నిర్మాత పార్థు

Tuesday, April 4, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీ థియేట‌ర్ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం సినీమ‌హ‌ల్‌. ల‌క్ష్మ‌ణ్ వ‌ర్మ అనే నూత‌న ద‌ర్శ‌కత్వంలో కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో ఈ చిత్రానికి బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా తెర‌కెక్కింది. అలీరాజా, సోహెల్, తేజస్విని నాయ‌కానాయిక‌లు. ఈ సినిమా మార్చి 31న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళవారం ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో..
మ‌యూరి డిస్ట్రిబ్యూట‌ర్స్‌వారు మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌డం మాకు చాలా ప్ల‌స్ అయ్యింది. డిఫ‌రెంట్ సినిమాల‌ను ఆద‌రిస్తార‌ని ప్రేక్ష‌కులు మ‌రోసారి ప్రూవ్ చేశారు. ఇంత‌టి విజయాన్ని అందించిన తెలుగు ఆడియెన్స్‌ను మ‌ర‌చిపోలేను అని ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌వ‌ర్మ తెలిపారు. కొత్త‌జోన‌ర్‌లో సినిమా చేశాం. అంద‌రూ కొత్త‌వాళ్ళం చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆద‌రించారు. స‌హ‌కారం అందించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, అంద‌రికీ థాంక్స్ అని అలీరాజా చెప్పారు.
విలేజ్‌, అర్బ‌న్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినీ మ‌హ‌ల్ చిత్రాన్ని ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కులకు థాంక్స్‌. చాలా మంది ఫోన్ చేసి సినిమా బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారని సోహెల్ తెలిపారు. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌గారు చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. సినిమా విడుద‌లైన రోజు నుండే మంచి ఆద‌ర‌ణ‌తో ముందుకు సాగుతుంది. శేఖ‌ర్‌చంద్ర మ్యూజిక్‌, స‌లోని స్పెష‌ల్ సాంగ్‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. మ‌యూరి సంస్థ ద్వారా సినిమా రిలీజ్ కావ‌డం మాకు ప్ల‌స్ అయ్యింది. సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలో అడుగుపెట్టిందని నిర్మాత పార్థు తెలియ‌జేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.