close
Choose your channels

రవితేజ గ్రీన్ సిగ్నల్?

Tuesday, December 29, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రవితేజ ఇప్పుడు ఆప‌ద్బాంధ‌వుడిగా క‌నిపిస్తున్నాడు. ఆ మ‌ధ్య సంప‌త్ నందికి అవ‌కాశ‌మిచ్చాడు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో ఫ్లాప్‌ను చ‌విచూసిన వేణు శ్రీరామ్‌తో ఎవ‌డో ఒక‌డు చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 20 నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో పూరితోనూ ఓ సినిమా చేయనున్న‌ట్టు వినికిడి. దాని త‌ర్వాత సుధీర్ వ‌ర్మ సినిమాకు ఓకే చెప్పార‌ట‌.

ఇప్పుడు తాజా స‌మాచారం ప్ర‌కారం ర‌వితేజ మ‌రో ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఫ్లాట్ అయ్యాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడి పేరు శ్రీరామ్ ఆదిత్య‌. ఈ మ‌ధ్య‌నే భ‌లే మంచి రోజు సినిమాతో స‌క్సెస్ మీదున్నాడు శ్రీరామ్‌. సుధీర్ బాబు న‌టించిన ఆ సినిమా ఈ మ‌ధ్య‌నే విడుద‌లై హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. సో ఈ మ‌ధ్య‌నే శ్రీరామ్ ఆదిత్య త‌న క‌థ‌ను ర‌వితేజ‌కు వినిపించాడ‌ట‌. ర‌వితేజ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు వినికిడి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.