close
Choose your channels

సాహసం శ్వాసగా సాగిపోలో వెళ్లిపోమాకే...సాంగ్ టీజర్ రిలీజ్..!

Thursday, September 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్నరొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాట‌లు యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఈరోజు ఈ చిత్రంలోని వెళ్లిపోమాకే...సాంగ్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ పాట‌ వింటుంటేనే త‌న‌కు తెలియ‌కుండానే క‌ళ్లంట నీళ్లు వ‌చ్చేసాయ‌ని నాగార్జున తెలియ‌చేసారు. అంత‌లా నాగార్జున మ‌న‌సును క‌ద‌లించిన పాట ఇది. ఈ చిత్రాన్నిత్వ‌ర‌లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.