close
Choose your channels

సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న 'తారామణి'

Monday, August 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అంజలి , ఆండ్రియా , వసంత్ రవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `తారామ‌ణి`. ఆగ‌స్ట్ 11న త‌మిళ‌నాట విడుద‌లైన `త‌ర‌మ‌ణి` చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. సినిమా టేకింగ్ కొత్త‌గా ఉండ‌టం, ప్ర‌స్తుతం యువ‌త టెక్నాల‌జీ కార‌ణంగా ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంది. అనే విష‌యాలు అంద‌రికీ క‌నెక్ట్ కావ‌డంతో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్ష‌కులే కాకుండా సినీ విమ‌ర్శ‌కులు సైతం సినిమాపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని `తారామ‌ణి` పేరుతో డివి సినీ క్రియేష‌న్స బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేష్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

డివి సినీ క్రియేష‌న్స్ అధినేత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ - ``ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌. ఆగ‌స్ట్ 11న విడుద‌లైన ఈ సినిమా త‌మిళ‌నాట బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ దుమ్ము రేపుతుంది. కాంటెంప‌ర‌రీ పాయింట్‌తో ద‌ర్శ‌కుడు రామ్ తెర‌కెక్కించిన సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ విడుద‌ల చేయ‌గా, పాట‌ల‌ను సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌గారు విడుద‌ల చేశారు. ప్రారంభం నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా అంద‌రి అంచనాల‌ను మించి ట్రెమెండ‌స్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం.

ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వాటిని త్వరలోనే పూర్తిచేసి ఈ నెలాఖరున లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కొత్త త‌ర‌హా చిత్రాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించే చిత్రంగా తారామ‌ణి మా బ్యాన‌ర్‌లో మంచి హిట్‌మూవీ అవుతుంది`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.