close
Choose your channels

బన్నితో ముచ్చటగా మూడోసారి....?

Thursday, September 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్` ఈ సినిమా ఈ సెప్టెంబ‌ర్ నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది.

నిర్మాత దిల్ రాజు సినిమాను వ‌చ్చే సమ్మ‌ర్ సంద‌ర్భంగా ఏప్రిల్ మొద‌టివారంలో విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఎవ‌డు, ఆర్య‌2 చిత్రాలు త‌ర్వాత అల్లుఅర్జున్‌, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్ర‌మిదే కావ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.