close
Choose your channels

'బాహుబలి-2' ఆడియో విడుదల ఎప్పుడంటే....

Thursday, February 23, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా `బాహుబ‌లి ది బిగినింగ్` రెండ‌వ పార్ట్ `బాహుబ‌లి-2 క‌న్ క్లూజ‌న్` రెడీ అవుతుంది. ప్ర‌భాస్, అనుష్క‌, త‌మ‌న్నా, సత్యరాజ్‌, రానా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం పార్ట్ 1, 600 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసి అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంది. ఇప్పుడంద‌రూ బాహుబ‌లి2 ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీని ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాడు. దీంతో తెలుగు సినిమా మార్కెట్‌ను ఇంకా విస్తృతం చేయ‌డానికి అవ‌కాశం ఉన‌ట్లే. కాగా ఈ సినిమా ఏప్రిల్ 28 2017న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. రేపు బాహుబ‌లి-2కు సంబంధించిన కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. అలాగే ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఉగాది రోజున నిర్వ‌హిస్తార‌ని టాక్ విన‌పడుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.