close
Choose your channels

మహేష్ ఆ దర్శకుడితో సినిమా చేస్తాడా...?

Tuesday, July 7, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటుంటారు. మహేష్ ఎప్పుడు డేట్స్ ఇస్తాడా, భారీ బడ్జెట్ మూవీ చేద్దామా? అని చాలా మంది నిర్మాతలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. మహేష్ తో సినిమా చేస్తున్నారనగానే వచ్చే క్రేజే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రస్తుతం మహేష్ శ్రీమంతుడు సినిమా తర్వాత బ్రహ్మోత్సవం సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తవగానే ఏ దర్శకుడితో సినిమా చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది దర్శకులు మహేష్ కోసం పిలుపు కోసం కథలతో సిద్ధంగా ఉన్నారు. అయితే బ్రహ్మోత్సవం తర్వాత మహేష్, శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాని నమత్ర శిరోద్కర్, ఓ ప్రముఖ దర్శకుడు కలిసి ప్రొడ్యూస్ చేయనున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజనిజాలు తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.