రామ్ చరణ్ బోయపాటిల ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

  • IndiaGlitz, [Monday,November 05 2018]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కైరా అద్వానీ నటిస్తోంది.

ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి 'స్టేట్ రౌడీ', 'వినయ విధేయ రామ' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రేపు మంగళవారం నవంబర్ 6న మధ్యాహ్నం 1 గంటలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే నవంబర్ 9 న ఉదయం 10:25 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయనున్నట్లు ట్వీట్టర్ వేదికగా ప్రకటించారు.

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

More News

వెంకీతో ప్రేమ కథ చిత్రాల దర్శకుడు

'మేము వయసుకు వచ్చాము' 'సినిమా చూపిస్తా మామ' 'నేను లోకల్' అంటూ దర్శకుడు త్రినాథ రావు నక్కిన కెరియర్ ఆరంభం నుండి వరుసగా ప్రేమ కథ చిత్రాలను చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.

'ఎఫ్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

విభిన్న‌మైన సినిమాలు, పాత్ర‌లు చేస్తూ కొత్త‌దనానికి పెద్ద పీట వేసే స్టార్ హీరో విక్ట‌రీ వెకంటేశ్‌... ఫిదా, తొలి ప్రేమ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సాధించిన

నవంబర్ 10 న 'అమర్ అక్బర్ ఆంటోనీ ' ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 16 న సినిమా విడుదల

మాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా  శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ' అమర్ అక్బర్ ఆంటోనీ '..

టీడీపి-కాంగ్రెస్ పొత్తు ఎన్టీఆర్ బయోపిక్ కి దెబ్బ కానుందా...

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'యన్ టి ఆర్'. నందమూరి బాలకృష్ణ  ఈ చిత్రమో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.

మెగా ఆర్ట్స్'మొన‌గాడెవ‌రు' షూటింగ్ ప్రారంభం!!

మెగా ఆర్ట్స్ ప‌తాకంపై వాడ‌ప‌ల్లి జ‌గ‌న్నాథం స‌మ‌ర్ప‌ణ‌లో  రాజ్ వాడ‌ప‌ల్లి  నిర్మిస్తోన్న చిత్రం 'మొన‌గాడెవ‌రు'. హు ఈజ్ నెంబ‌ర్ వ‌న్ ట్యాగ్ లైన్‌.