close
Choose your channels

'రభస' కాదట...

Tuesday, September 10, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ లో బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం పేరు 'రభస'అని ముందు అనుకున్నారు. ఎన్టీఆర్, సమంత, మళయాలీ భామ నజ్రీయా నజీమ్ జంటగా నటిస్తున్నారు. కాగా ప్రస్తుత సమాచారం టైటిల్ రభస కాదని తేలిపోయింది. సమంతే ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేసింది.

మొన్నటికి మొన్న అనూప్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నారు. కానీ అనూప్ స్థానంలో తమన్ చేరాడు. అదేవిధంగా ఇప్పుడు టైటిల్ సైతం మారిపోయింది. సినిమా ప్రారంభంలోనే ఇన్ని టర్నింగ్ పాయింట్స్ తీసుకుంటున్న ఈ సినిమా టైటిల్ ఏంటనేది మరి తెలియాల్సి ఉంది.

Follow us on Google News and stay updated with the latest!