close
Choose your channels

'రేయ్' ట్రైలర్ విడుదల

Sunday, April 13, 2014 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

View Rey Trailer Launch Gallery

View Rey Trailer Launch Gallery

సాయిధరమ్ తేజ్ హీరోగా బొమ్మరిల్లు వారి బ్యానర్ లో వైవియస్ చౌదరి దర్వక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'రేయ్'. శ్రద్ధాదాస్, సయామీఖేర్లు హీరోయిన్స్. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్స్ ను ఆదివారం హైదరాబాద్ లో విడుదల చేశారు. హీరో రామ్ థియేట్రికల్ ట్రైలర్స్ ను విడుదల చేశారు.

వైవియస్ చౌదరి మాట్లాడుతూ 'నాకు సచిన్ స్ఫూర్తి. అయనలా నా సినిమాకి ఏం కావాలి, ఎలా తీయాలి అని ఆలోచిస్తాను. ఈ సినిమాలో నోయ ల్ ర్యాప్ పాడడమే కాకుండా, మంచి పాత్ర లో కనపడతాడు. అనేక అడ్డంకులను దాటి సినిమాని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. థియేటర్లో రేసుగుర్రంతో పాటు ట్రైలర్స్ విడుదల చేశాం' అని తెలిపారు.

సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ 'రామ్ నాకు సీనియర్. తన దగ్గర ఈ సినిమా గురించి చెబుతుండేవాడిని. తను నాకు బాగా సపోర్ట్ చేశాడు. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం ఉంది' అని అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ 'వైవియస్ గారు నాకు పదేళ్ల నుండి తెలుసు. ఆయన్ని చూస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రాజమౌళి, వినాయక్ లా తన సినిమాకి ఏం కావాలో తెలిసిన దర్శకుడు. ఈ సినిమా టైమ్ లో సాయిధరమ్ నన్ను కలిస్తే వైవియస్ గారిని ఫాలో అవమని చెప్పానంతే. సినిమా పెద్ద హిట్టయ్యి వైవియస్ గారికి లాభాలను తేవాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.

Follow us on Google News and stay updated with the latest!