విశాల్ చిత్రం వాయిదా

  • IndiaGlitz, [Friday,May 10 2019]

న‌టుడు, న‌డిగ‌ర్ సంఘం కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ న‌టించిన చిత్రం 'అయోగ్య‌'. తెలుగులో విజ‌య‌వంత‌మైన 'టెంప‌ర్'కు ఇది రీమేక్‌. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాను మే 10న విడుద‌ల చేయాల‌నుకున్నారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ శిష్యుడు వెంక‌ట్ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారు. అయితే నేడు రిలీజ్ కావాల్సిన సినిమా ఎందుక‌నో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింద‌నే దానిపై స‌రైన కార‌ణాలు తెలియ‌డం లేదు. నిర్మాత‌ల మండ‌లి వ్యవ‌హార‌మే కార‌ణ‌మై ఉండొచ్చున‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి త‌దుప‌రి రిలీజ్ డేట్‌ పై నిర్మాత‌లు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. 

More News

మీడియా సర్కస్ వల్ల

బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ త‌న సినిమా 'సూప‌ర్ 30'కి సంబంధించి తన ట్విట్ట‌ర్ ద్వారా ప్రెస్‌నోట్‌ను విడుద‌ల చేశారు. "ఓ మీడియా వ‌ర్గం చేస్తున్న స‌ర్క‌స్ వ‌ల్ల నేను మాన‌సిక వేద‌న‌ను అనుభ‌విస్తున్నాను.

బిగ్‌బాస్‌3కి రెఢీ

లోక నాయకుడు క‌మ‌ల్‌హాస‌న్ లోక్‌స‌భ ఎన్నిక‌లు త‌ర్వాత సినిమాల‌తో, టీవీ ప్రోగ్రామ్‌ల‌తో బిజీగా మారిపోతున్నారు ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించాల్సిన `ఇండియ‌న్ 2`

హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇప్పుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో 'ద‌ర్బార్‌' సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ త‌న‌కు హిట్ ఇచ్చిన యువ ద‌ర్శ‌కుడు కార్తీక్

శౌర్య‌తో మెహ‌రీన్‌

ఈ ఏడాది `ఎఫ్‌2` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించి ఆక‌ట్టుకుంది మెహ‌రీన్ కౌర్‌. ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఈ ఏడాది రెండు సినిమాల‌కు సైన్ చేసింది.

ఎల్లుండి ఎస్పీవై రెడ్డి ఇంటికి జనసేనాని

నంద్యాల ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ రెడ్డి తుదిశ్వాస విడిచారు.