తిరుపతి రుయాలో ఘోరం.. 11 మంది ప్రాణాలు బలిగొన్న 15 నిమిషాలు!

  • IndiaGlitz, [Tuesday,May 11 2021]

తిరుపతిలోని రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణ మృదంగం మోగింది. రుయా ఆసుపత్రిని ప్రభుత్వం జిల్లాస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచే చుట్టుపక్కల జిల్లాల కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో ఆక్సిజన్‌ అందక 11 మంది బాధితులు మరణించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ధృవీకరించారు. ఆస్పత్రి ఆవరణలోనే 11వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. దీని నుంచే రుయా ఆస్పత్రిలోని వెంటిలేటర్‌, ఐసీయూ, బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది.

Also Read: ఏపీ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్స్‌కు తెలంగాణలోకి నో ఎంట్రీ..

అయితే సోమవారం సాయంత్రానికి నిల్వలు అయిపోయే అవకాశముందని సిబ్బంది ముందుగానే అధికారులకు చెప్పారు. అధికారులు సైతం వెంటనే స్పందించి తమకు ఆక్సిజన్‌ సరఫరా చేసే చెన్నైకి చెందిన లిండేన్‌ కంపెనీకి సమాచారం అందించారు. చెన్నైలో సాయంత్రం 4 గంటలకు ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరింది. నిబంధనల ప్రకారం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణించకూడదు. దీంతో... అది తిరుపతికి చేరుకునే సరికి ఆలస్యమైంది. దీంతో 11 మంది మృతి చెందారు. రాత్రి 7 గంటలకు ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు 3 కేఎల్‌కు పడిపోయాయి. దీంతో సరఫరాకు సరిపడా ప్రెషర్‌ అందలేదు.

ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో ఉన్న వెంటిలేటర్‌ బెడ్లపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో 51మంది చికిత్స పొందుతున్నారు. వీరిలోనే ఎక్కువమంది చనిపోయారు. కాగా.. సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడగా... నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. 7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్‌తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాలే కీలకంగా మారాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం 5 నిమిషాల ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగానే ఎక్కువ మంది చనిపోయారని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.

More News

థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని సోనూసూద్ సంచలన నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎంత అల్లకల్లోలం చేస్తోందో తెలియనిది కాదు.

తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో రైల్వే కీలక నిర్ణయం

కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది.

అమెరికాలో దిల్ రాజు దంపతుల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ

నిర్మాత దిల్ రాజు, వైఘా రెడ్డిని గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఓ గుడిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కరోనా

కరోనా ఫస్ట్ వేవ్‌లో పెద్దగా సెలబ్రిటీలెవరూ కరోనా బారిన పడలేదు కానీ సెకండ్ వేవ్‌లో మాత్రం స్టార్ హీరోలంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

ఈటల, కొండా కలిసి కేసీఆర్ సీటుకు ఎసరు పెడతారా?

ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఏమో కానీ కొండా మాత్రం స్పీడ్ పెంచేశారు.