విశాఖ హిందూస్థాన్‌లో ప్రమాదం.. 11 మంది మృతి

  • IndiaGlitz, [Saturday,August 01 2020]

విశాఖలో మరో ప్రమాదం సాగర వాసులను భయాందోళనలకు గురి చేసింది. హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 10 మంది మృతి చెందారు. క్రేన్‌ను తనిఖీ చేస్తుంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న 11 మంది మృతి చెందారు. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే హిందూస్థాన్ షిప్ కొనుగోలు చేసిన ఈ క్రేన్ ప్రమాద సమయంలో 15 మంది ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎల్జీ గ్యాస్ లీకేజీ, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా.. తాజాగా షిప్ యార్డు ఘటన... ఇలాంటి వరుస ఘటనలు.. విశాఖ వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

More News

కరోనా వ్యాక్సిన్ విషయమై గుడ్ న్యూస్ చెప్పిన నిమ్స్ వైద్యుడు

భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా నిరోధక వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులు..

ఏపీకి వెళ్లాలనుకునే వారు ఇకపై పెద్దగా షరతులేమీ లేకుండా సులువుగా వెళ్లవచ్చు

ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డిపై ఇళ‌య‌రాజా ఫిర్యాదు

త‌న‌ను బెదిరిస్తున్నార‌ని, త‌న స్టూడియోను ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌ముఖ సంస్థ ప్ర‌సాద్ ల్యాబ్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎల్‌.వి.ప్ర‌సాద్ మ‌న‌వ‌డు

మూడు రాజధానులపై పవన్ ఏమన్నారంటే...

ఏపీలో శుక్రవారం చోటు చేసుకున్న కీలక పరిణామంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

దేశంలో షాకిస్తున్న కరోనా.. నేడు 57 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసులు షాక్‌కు గురి చేస్తున్నాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.