తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నేడు 1986 కేసులు

  • IndiaGlitz, [Friday,July 31 2020]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ డబుల్ డిజిట్‌లో కేసులు నమోదవుతున్నాయి. కరోనా హెల్త్ బులిటెన్‌ను శుక్రవారం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 21,380 శాంపిళ్లను పరీక్షించగా.. 1986 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,703కు చేరుకుంది.
కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 519కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 4,37,582 శాంపిళ్లను పరీక్షించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా.. నేడు కూడా ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 586 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చల్, మల్కాజ్‌గిరిలో 207 కేసులు రంగారెడ్డి జిల్లాలో 205 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన కీలక సమాచారమిచ్చిన రాజేష్ భూషణ్..

ప్రపంచమంతా కరోనా విజృంభిస్తోంది. కరోనా విముక్తి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. దీనికోసం శాస్త్రవేత్తలు కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నారు.

ఏపీలో మరోసారి షాకిచ్చిన కరోనా.. భారీగా కేసుల నమోదు

ఏపీలో కరోనా మరోసారి షాకిచ్చింది. తొలిసారిగా బుధవారం 10 వేలు దాటిన కేసులు.. నేడు అంతకంటే మరికొన్ని ఎక్కవే నమోదు కావడం గమనార్హం.

‘మలుపు’ హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి?

టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా రెండు వర్గాల ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు ఆది పినిశెట్టి. విలన్‌గానూ..

అయోధ్యలో కరోనా కలకలం.. పూజారి సహా 17 మందికి కరోనా..

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు చూస్తున్న పూజారి సహా అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు మొత్తంగా 17 మందికి కరోనా సోకింది.

ఏపీలో మోగిన ఉప ఎన్నిక నగారా..

ఏపీలో ఉప ఎన్నిక నగారా మోసింది. ఏపీ కౌన్సిల్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.