'2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Thursday,November 16 2017]

ప్రతిష్టాత్మక మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. హీరో సునీల్, మనీషా రాజ్ జంటగా ఒక చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, మలయాళం లో ఇదే పేరుతో వచ్చి విజయం సాధించిన చిత్రం యొక్క రీమేక్. ఇటీవలే, టైటిల్ లోగో విడుదలయ్యి అందరిని ఆకట్టుకుంది.

'జై బోలో తెలంగాణ', 'శ్రీ రాములయ్య', 'భద్రాచలం', 'జయం మనదేరా' వంటి ఎన్నో కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించిన ఎన్.శంకర్, ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారని తెలుస్తుంది. '2 కంట్రీస్' అమెరికా మరియు ఇండియా లోని ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకొని డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

"టైటిల్ లోగోకు మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ విడుదల చేశాము. టీజర్ నవంబర్ 24 న విడుదల చేయ నిశ్చయించాము. చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నాము. 2 కంట్రీస్ భారీ బడ్జెట్ తో, ఉత్తమ సాంకేతిక విలువలతో నిర్మించబడింది. హీరో గా సునీల్ కు ఈ చిత్రం అద్భుత విజయానందిస్తుందని," చెప్పారు ఎన్.శంకర్.

More News

ప్రేమతో మీ కార్తిక్ పాటలను రిలీజ్ చేసిన వంశి, హరీష్ శంకర్

మూడు జెనరేషన్స్ మద్య ప్రేమ ఆప్యాయతల్ని చక్కగా తెరకెక్కించినచిత్రం `ప్రేమతో మీ కార్తీక్`. రిషి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీందర్ ఆర్.గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తికేయ, సిమ్రాత్ లు హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు.

వెంకీ చిత్రంలో రానా, నాగచైతన్య?

గురు చిత్రం తరువాత కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న సీనియర్ కథానాయకుడు వెంకటేష్.. తన తదుపరి సినిమాని సంచలన దర్శకుడు తేజతో చేయబోతున్న సంగతి తెలిసిందే.

శర్వానంద్ తో సాయిపల్లవి?

మహానుభావుడుతో రీసెంట్ గా తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకున్నారు యువ కథానాయకుడు శర్వానంద్. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది రూట్ మారుస్తున్న నితిన్

గత మూడేళ్లుగా ఏడాదికో సినిమాతో పలకరిస్తూ ఉన్నాడు యువ కథానాయకుడు నితిన్. 2015లో కొరియర్ బోయ్ కళ్యాణ్ తో పలకరించిన నితిన్.. గతేడాది సంచలన విజయం సాధించిన అఆతో పలకరించారు. ఇక ఈ సంవత్సరం లైతో సందడి చేశారు.

శ్రియతో కెమిస్ట్రీ బావుందట

పదహారేళ్లుగా కథానాయికగా అలరిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్. ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టి దేవీ పాత్రలో అలరించిన శ్రియ.. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉంది.