close
Choose your channels

'అదేరా ప్రేమంటే...' షూటింగ్ పూర్తి...

Sunday, January 5, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శివరామ్ అయంచ, దీప్సిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అదేరా ప్రేమంటే'. పవన్ సిద్ధార్థ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాబు.ఎస్ దర్శకుడు. శ్రీనివాస్ అనంతనేని నిర్మాత. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా ...చిత్ర నిర్మాత శ్రీనివాస్ అనంతనేని మాట్లాడుతూ 'ధర్శకుడు కథ చెప్పినట్లే ఆసక్తికరంగా సినిమాని తెరకెక్కించాడు. కథకు తగిన నటీనటులను ఎన్నుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల చివరివారంలో ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'సినిమా కోసం నాగబాబు బాగా సపోర్ట్ చేశారు. ప్రేమలో ఒక కొత్త కోణాన్ని ఇందులో చూపించడం జరిగింది. రొమాంటిక్ టచ్ తోపాటు కామెడీ అంశాలున్న సినిమా ఇది.అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే ఆడియో, సినిమాని విడుదల చేస్తాం అని అన్నారు.

ఇంకా ఈ సినిమాలో నాగబాబు, రామారావు, తాగుబోతు రమేష్, శ్రీనివాస్ అనంతనేని, తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమాకి సంగీతం:విజయ్ ప్రకాష్ తవ్వా, కెమెరాః వై.కె.ప్రసాద్, నిర్మాతః శ్రీనివాస్ అనంతనేని, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బాబు.ఎస్

Follow us on Google News and stay updated with the latest!