ఏపీలోనూ విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. వెలుగులోకి మూడో కేసు, తూర్పుగోదావరిలో కలకలం

  • IndiaGlitz, [Friday,December 24 2021]

దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో అంతకంతకూ విస్తోరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎక్కువగా వుండగా.. ఏపీలోనూ విస్తరిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మూడో ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మహిళకు కొత్త వేరియంట్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితురాలు ఈనెల 19న కువైట్‌ నుంచి విజయవాడకు చేరుకుని.... అక్కడి నుంచి అయినవిల్లి మండలం నేదునూరు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెకు జరిపిన పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆ మహిళ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌‌గా నిర్ధారణ అయింది. బాధితురాలి భర్త, పిల్లలకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగటివ్‌ వచ్చిందని.. మరోసారి టెస్టులు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

అటు దేశంలో నిన్న ఒక్కరోజే 100కు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. నిన్న ఉదయానికి 236గా ఉన్న ఒమిక్రాన్ బాధితుల సంఖ్య.. తాజాగా 358కి చేరింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో అత్యధికంగా 88 మందికి ఒమిక్రాన్ సోకగా.. దేశ రాజధాని ఢిల్లీ (67) తర్వాతి స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు 114 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే నిన్న 11లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా..6,650 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 7,051 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. 374 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలోని కోవిడ్-19 పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు.. దేశంలోని పరిస్థితి, ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని .. టెస్టుల ‌ సంఖ్యను పెంచడంతోపాటు.. కాంటాక్ట్‌లను ట్రేసింగ్‌ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేసుల తీవ్రత ఎక్కువ వున్న రాష్ట్రాలకు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపుతామని ప్రధాని మోడీ తెలిపారు.

More News

పెరట్లో ఆనపకాయలు చూసి మురిసిపోతూ... రైతుకి సెల్యూట్ చేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వుంటారు.

రాధేశ్యామ్ ట్రైలర్: యాక్షన్ పక్కనబెట్టి, రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రభాస్

బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాపై టాలీవుడ్‌తో పాటు యావత్ దేశం ఎన్నో అంచనాలు పెట్టుకుంది.

‘‘అన్నాత్తే’’ టెక్నీషియన్లకు రజనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇంటికి పిలిపించి మరి

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అన్నాత్తే' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘బంగార్రాజు’

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.

కమ్ముకొస్తున్న ఒమిక్రాన్.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ సర్కార్‌కి కీలక ఆదేశాలు

మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. దీనిని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకునేందుకు చిన్నా, పెద్దా అంతా రెడీ అవుతున్నారు.