close
Choose your channels

రాధేశ్యామ్ ట్రైలర్: యాక్షన్ పక్కనబెట్టి, రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రభాస్

Friday, December 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాధేశ్యామ్ ట్రైలర్: యాక్షన్ పక్కనబెట్టి, రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రభాస్

బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాపై టాలీవుడ్‌తో పాటు యావత్ దేశం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా రాధేశ్యామ్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మూడు నిమిషాల పైనే నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో కథను చెప్పేలా కట్ చేశారు.

రాధేశ్యామ్ ట్రైలర్: యాక్షన్ పక్కనబెట్టి, రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రభాస్

ప్రపంచం మొత్తం కలవాలనుకునే హస్తసాముద్రికం చెప్పే నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌ను కృష్ణంరాజు పరిచయం చేస్తారు. ‘రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు..నా చేతిలో ప్రేమ‌, పెళ్లి లేవ్‌..’ ‘దిగ్రేట్ విక్ర‌మాదిత్య .. నేన‌త‌డిని హ‌స్త సాముద్రికానికి ఐన్‌స్టీన్ అని పిలుస్తా..’ అంటూ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అలాగే ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య లవ్ ట్రాక్ బాగుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటే ప్రళయం వస్తుందని చూపించడం ద్వారా ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా షిప్‌ ఉన్న విజువల్స్ టైటానిక్‌ను తలపించాయి. టెక్నికల్‌గా ఎక్కడా తగ్గకుండా విజువల్స్ కనిపిస్తున్నాయి.

రాధేశ్యామ్ ట్రైలర్: యాక్షన్ పక్కనబెట్టి, రొమాన్స్‌లో మునిగిపోయిన ప్రభాస్

ఇక ఈ సినిమాలో.. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్, మేజర్ రవిచంద్రన్, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చగా.. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.