ఘోర అగ్నిప్రమాదంలో 43 మంది మృతి.. ప్రధాని దిగ్భ్రాంతి

  • IndiaGlitz, [Monday,December 09 2019]

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాగా ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాల్లో ఇదే అతిపెద్ద ప్రమాదని తెలుస్తోంది. ఆదివారం నాడు తెల్లవారు జామున ఝాన్సీరోడ్డులోని అనాజ్‌ మండీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా గాయపడ్డ వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా.. ఈ ప్రమాదం భారీ నుంచి మరో 50 మందిని సహాయక సిబ్బంది క్షేమంగా కాపాడింది. కాగా.. ఈ అగ్నిప్రమాదం స్కూలు బ్యాగులు, బాటిళ్లు, ఇతర చిన్నచిన్న సామగ్రి తయారు చేసే కుటీర పరిశ్రమ అని తెలుస్తోంది. కార్మికులంతా నిద్రలో ఉండడంతో ఊపిరాడక నిద్రలోనే చాలామంది చనిపోయినట్లు సమాచారం.

ప్రముఖుల స్పందన.. తీవ్ర దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని.. ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు మోదీ రూ.2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది చాలా బాధాకర ఘటన అని దీనిపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. గాయాలపాలైన వారికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం ఇస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రమాద ఘటనపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

More News

'అమరం అఖిలం' ప్రేమ టీజర్ ఆవిష్కరణ

సుకుమార్ గుర్తించిన యంగ్ టాలెంటెడ్ టీమ్ అంటే తప్పకుండా వీరిలో వున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చాలా సినిమాలు ఈ తరాలకు అందట్లేదు.. భద్రపరుచుకోవాలి: చిరు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్‌లో ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఐదవ ఫిల్మ్ ప్రిజర్వేషన్ అండ్ రీస్టోరేషన్ వర్కుషాప్ జరిగింది.

'ఎంత మంచివాడ‌వురా' తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

`ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో..

మైనస్ 4 డిగ్రీల చ‌లిలో 'వెంకీమామ‌' కోసం చైతు ప‌డ్డ క‌ష్టం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ‌`.

నాగ్ అశ్విన్ `ల‌స్ట్ స్టోరీస్‌`

హిందీలో విజ‌య‌వంత‌మైన ల‌స్ట్ స్టోరీస్ త‌ర‌హాలో ఓ తెలుగులో ల‌స్ట్‌స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.