ఘోర దుర్ఘటన... 62 మంది  సజీవ దహనం !

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

ఆఫ్రికా దేశంలోని టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. ఇది గమనించిన స్థానికులు, ప్రయాణికులు ఆయిల్‌ను తెచ్చుకునేందుకు క్యూ కట్టారు. అయితే ఒక్కసారి ఘటనాస్థలిలో భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున జనాలు సజీవ దహనమయ్యారు. కాగా.. వీరిలో అత్యధికులు స్థానిక ట్యాక్సీ డ్రైవర్లేనని తెలిసింది. తెలుస్తోంది. ఈ ఆయిల్ ట్యాంకర్ విస్ఫోటనంతో మొత్తం 62 మంది దుర్మరణం పాలయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు గుర్తించింది 62 మృతదేహాలే.. మరికొందర్ని అత్యవసర చికిత్సకై ఆస్పత్రికి తరలించడం జరిగింది. అయితే ఇంకా కొందరు మంటల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

అసలేం జరిగింది!?

కాగా ఈ ఘోరానికి కారణం ఓ వ్యక్తి సిగరెట్ అంటించడమేనని తెలుస్తోంది. అందరితో పాటు ఓ వ్యక్తి పెట్రోల్ తీసుకోవడానికి ట్యాంకర్ దగ్గరికి వెళ్లాడు. అయితే సిగరెట్ అలవాటు ఉండటంతో అనుకోకుండా సిగరెట్ వెలిగించాడట. దీంతో ఒక్కసారి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయని సమాచారం. ఈ భారీ శబ్దాలకు ట్యాంకర్ పేలిపోయింది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది..? అనే కచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.

More News

చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని నెటిజన్స్ టార్గెట్ చేశారు. సాధారణంగా మహిళల సాధికారికత గురించి చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటుంది.

జనసేన వీడటంపై లక్ష్మీ నారాయణ క్లారిటీ

జనసేన కీలకనేత మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

షాకింగ్ లుక్‌లో రామ్.. ఇందులో నిజమెంత!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి ఊపు మీదున్న రామ్ పోతినేని.. తదుపరి ఏ చిత్రంలో.. ఎవరి దర్శకత్వంలో తెరకెక్కబోతోందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

`సాహో` ట్రైలర్ రివ్యూ: గల్లిలో కాదు.. స్టేడియంలో కొట్టినోడే..

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం `సాహో`. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ట్రాప్ మూవీ ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులనందర్నీ 'ట్రాప్' లో పడేస్తుంది అనిపించింది - రసమయి బాలకిషన్

ప్రేమ కవితాలయ ఫిలిమ్స్ బ్యానేర్ పై మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ హీరోహీరోయిన్లుగా వీ ఎస్ ఫణింద్ర దర్శకత్వంలో