close
Choose your channels

షాకింగ్ లుక్‌లో రామ్.. ఇందులో నిజమెంత!?

Saturday, August 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి ఊపు మీదున్న రామ్ పోతినేని.. తదుపరి ఏ చిత్రంలో.. ఎవరి దర్శకత్వంలో తెరకెక్కబోతోందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సడన్‌గా షాకింగ్ లుక్‌లో రామ్ కనిపిచడంతో అభిమానులంతా కంగుతిన్నారు. వామ్మో.. ఈ ‘గుండు ఇస్మార్ట్ శంకర్’ ఎందుకిలా తయరయ్యాడు. సినిమా హిట్టవ్వడంతో ఇలా గుండు కొట్టించుకున్నారా..? లేకుంటే కొత్త సినిమా ఈ గెటప్‌లో దర్శనమిచ్చాడా..? అనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌, సోషల్ మీడియాలో ఈ కొత్త గెటప్ గురించే చర్చించుకుంటున్నారు.

కాగా.. నిజంగానే రామ్ ఇలా ‘గుండు గీయించుకుని, ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నారా..’ లేకుంటే ఫొటోషాప్‌లో ఇలా చేశారా..? అనేది మళ్లీ అనుమానాలు సైతం వస్తున్నాయి. అయితే ఈ మధ్య రకరకాల యాప్‌లు వచ్చేస్తుండటంతో ఏది రియల్ లుక్.. ఏది డమ్మీ లుక్ అనేది తెలియక ఫొటోలు చూసిన జనాలు అవాక్కవుతున్నారు. అయితే ఓ వీరాభిమాని రామ్‌ను ఇలా ఫొటో షాప్‌లో చేసి పంపడంతో ఆయన లుక్ బాగుందని ఇలా ట్వీటారని తెలుస్తోంది. వాస్తవానికి ఇస్మార్ట్ తర్వాత రామ్ ఇంతవరకూ ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. మరి ఈ లుక్ ఎందుకో.. దేని కోసమో తెలియాలంటే రామ్‌ రివీల్ చేసేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.