ఆది కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరింది

  • IndiaGlitz, [Tuesday,March 06 2018]

'ప్రేమ కావాలి', 'లవ్లీ' సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న యువ క‌థానాయ‌కుడు ఆది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. 'వినాయకుడు', 'విలేజీలో వినాయకుడు', 'కేరింత' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అడివి సాయికిరణ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయ‌నున్నారు. ఈ చిత్రంలో ఆదికి జంటగా సాషా చెట్రి న‌టిస్తోంది. ఎయిర్ టెల్ 4జి ప్రకటనలతో ఈ భామ అందరికి సుపరిచితురాలే. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రానికి.. ఈ నెల 7వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటించనుంది చిత్ర బృందం. ఇదిలా వుంటే.. ప్రస్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు విశ్వనాథ్ ఆరిగేల రూపొందిస్తున్న‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌లో ఆది నటిస్తున్నారు.

దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనుంది చిత్ర బృందం.అలాగే వేసవి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. గత కొంత కాలంగా విజయానికి దూరమైన ఆది.. ఈ చిత్రాలతోనైనా మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌స్తారేమో చూడాలి.

More News

రామ్ కు సెకండ్ హీరోయిన్ దొరికిందా?

యువ కథానాయకుడు రామ్,దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో

రాజకీయ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా

సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి'తో దక్షిణాది పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారిపోయారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.

రవితేజ, కళ్యాణ్ కృష్ణ మూవీ అప్ డేట్

మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న టైటిల్).

డ‌బ్బింగ్ ప‌నిలో బిజీ అయిపోయిన చ‌ర‌ణ్‌

రామ్ చరణ్, సమంత జంటగా నటించిన సినిమా 'రంగస్థలం'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1985నాటి పరిస్థితులకు అద్దం పడుతూ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకుంది ఈ మూవీ.

ఆ దర్శకుడితో బన్నీ మరోసారి..?

వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో యువ కథానాయకుడు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు.