close
Choose your channels

రాజకీయ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా

Tuesday, March 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంచ‌ల‌న విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి`తో ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లోనే హాట్ టాపిక్‌గా మారిపోయారు యువ క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్.. చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేస‌విలో ఏకంగా మూడు సినిమాల‌తో ఆయ‌న సంద‌డి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. వాటిలో ఏ మంత్రం వేశావే` ఈ నెల 9న విడుదల కానుండగా.. టాక్సీవాలా` మే 18న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అత‌ను కీల‌క పాత్ర‌లో న‌టించిన 'మహాన‌టి' కూడా వేస‌విలోనే తెర‌పైకి రానుంది. ఇదిలా వుంటే.. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లో కూడా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు ఈ వర్ధమాన నటుడు.

అందుకే త‌మిళ దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన విభిన్నమైన కథతో.. తమిళంలో ఓ సినిమా చేయడానికి సిద్ధపడ్డారు విజయ్. త‌మిళంతో పాటు తెలుగులోనూ ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోమవారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా, రాజకీయ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. ఒక రాజకీయ నేత వారసుడిగా.. రాజకీయాలను, ప్రజలను ప్ర‌భావితం చేసే పాత్రలో విజయ్ కనిపించనున్నారని సమాచారం. అర్జున్ రెడ్డి` తరహాలో ఈ సినిమాని కూడా యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న‌ ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.