ఆది సాయి కుమార్ ''తీస్ మార్ ఖాన్" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Monday,October 18 2021]

లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆది సాయికుమార్... పలు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు. అతని నుండీ రాబోతున్న తాజా చిత్రం ' తీస్ మార్ ఖాన్ '. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆకర్షించే అందం, చక్కటి అభినయం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ ఫస్ట్ లుక్ లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమా లో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు

More News

ఎన్నెన్నో జన్మల బంధం... స్టార్ మా లో...

కొత్తదనం వున్న కథలు... ప్రతి ఇల్లూ తనది అనుకునే ఎన్నో కుటుంబాల్ని తెలుగు ప్రేక్షకులకు తన ధారావాహికలతో పరిచయం చేస్తున్న స్టార్ మా ఈ సారి

ఆమె నా కూతురు కాదు, ఆస్తుల్ని కాజేసేందుకే ఈ ప్రచారం: ‘‘ పెళ్లి సందD ’’ హీరోయిన్ శ్రీలీలపై ఆరోపణలు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించిన చిత్రం ‘‘ పెళ్లి సందD ’’. ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు.

శర్వానంద్, రష్మిక మందన్నా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఫస్ట్ లుక్ విడుదల

శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ రాబోతోన్న...

మెగా క‌లయిక‌.. చ‌ర‌ణ్‌‌తో ప్ర‌శాంత్ నీల్ మూవీ

వరుస సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ కోవలో మెగా అభిమానులకు దసరా రోజున అదిరిపోయే కానుకలు వచ్చాయి.

మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం, స్నేహా ఉల్లాల్ ఫోటోలు వైరల్

నీలిరంగు కళ్లు, వైట్ స్కిన్ టోన్, కట్టిపడేసే చిరునవ్వుతో జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా గుర్తింపు తెచ్చుకుంది స్నేహా ఉల్లాల్. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన స్నేహకు