close
Choose your channels

ఆది సాయి కుమార్ ''తీస్ మార్ ఖాన్" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Monday, October 18, 2021 • తెలుగు Comments

లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆది సాయికుమార్... పలు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు. అతని నుండీ రాబోతున్న తాజా చిత్రం ' తీస్ మార్ ఖాన్ '. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆకర్షించే అందం, చక్కటి అభినయం తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా ఓ కీలకమైన పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ నటిస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంలో ఆది మరో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఓల్టేజ్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ ఫస్ట్ లుక్ లో ఆది నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ నడుస్తూ వస్తున్నట్లు ఉన్న ఈ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ సినిమా లో స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో ఆది నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

నటీనటులు: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz