పవన్.. బాబును నమ్ముకుంటే..!: ఆమంచి సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,November 04 2019]

విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ సక్సెస్ అయ్యింది. ఇటు టీడీపీ.. అటు బీజేపీ నేతల మద్ధతుతో మార్చ్‌.. కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ముగిసింది. అయితే ఈ మార్చ్‌పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం నాడు లాంగ్‌మార్చ్ ముగిసిన మరుక్షణం నుంచే మీడియా ముందుకొచ్చిన వైసీపీ నేతలు.. పవన్‌పై కౌంటర్లేశారు. తాజాగా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏం వదిలొచ్చారు పవన్!

పవన్ ఏమి వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. రాజకీయాల్లోకి రావడానికి పవన్ మేకప్ ఒక్కటి మాత్రమే వదిలేసారంతే.

భీమవరంలో సూర్యమిత్ర వాళ్ళు నీ గెలుపు కోసం డబ్బులు పంపిణీ చేశారా లేదా..?.

సినిమాల్లో నువ్వు తీసుకున్న రెమ్యూనరేషన్‌కు లెక్కలు చెప్పావా..?

‘అజ్ఞాతవాసి’ లాంటి సినిమా టికెట్లు ఎక్కువ రేట్లు అమ్మిన విషయం మర్చిపోయావా..?.

నీ వ్యక్తిత్వాన్ని నీతిమాలిన రాజకీయాల కోసం త్యాగం చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు. నీతి వంతమైన రాజకీయాలు పవన్ ఎక్కడ చేశారో చెప్పాలి ..?

ఎంపీ స్థాయి వ్యక్తి నిన్ను నమ్ముకొని రాజకీయాల్లోకి వస్తే కనీసం నువ్వు ప్రచారానికి వెళ్ళలేదు

నిన్ను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వారిని నువ్వు మోసం చేశావ్ అని పవన్‌పై ఆమంచి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

90శాతం వాటా పవన్, చంద్రబాబులదే..!

‘పవన్ లాంగ్ మార్చ్ సినిమాటిక్ స్టైల్‌లో ఉంది

ఇసుక కొరత ఉంది కార్మికులు ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది.

ఇసుక సమస్యను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇసుకలో దోపిడీ నియంత్రించాలని కొత్త పాలసీ తీసుకొచ్చాము.

వరదల కారణంగా ఇసుక తవ్వలేకపోతున్నాం.

భవన నిర్మాణ కార్మికుల్లో ఆత్మహత్యల్లో 90శాతం వాటా పవన్, చంద్రబాబులదే.

ఇసుక కొరత వల్ల కార్మికులను ఆత్మహత్యలు చేసుకునేలా పవన్, చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు

మంత్రి బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులను విమర్శించే స్థాయి పవన్‌కు లేదు.

పవన్ ఏమి వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. నాదెండ్ల మనోహర్ రాసిన స్క్రిప్ట్‌నే పవన్ చదివారు’ అని ఆమంచి విమర్శించారు.

చంద్రబాబును నమ్ముకుంటే..!

‘సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్‌కు లేదు.
పవన్... చంద్రబాబును నమ్ముకుంటే ఎయిడ్స్ పేషంట్‌ను పెళ్లి చేసుకున్నట్లే. దేశంలో రాజధానికి పేరు పెట్టని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజధానికి పేరు పెట్టని చంద్రబాబును పవన్ ‌ఎందుకు ప్రశ్నించడం లేదు. ?. రాజధాని దోపిడీ రాజధాని వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీకి నివేదిక ఇవ్వబోతున్నా రాజకీయ నాయకుడిగా పవన్ ఎదగాలంటే నీ చుట్టూ శక్తులను వదిలేయ్. రంగాను హత్య చేసిన వారితో నువ్వు చేతులు కలపడం సిగ్గుచేటు.

ఇసుక దోపిడీకి పాల్పడిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఇసుక దోపిడీకి ఎలా అక్కడ ఉన్న పాలపడ్డారో జనసేన నాయకులను అడగండి. జగన్ వ్యక్తిత్వం గురించి తెలిసిన రోజున ఇండస్ట్రీ పెద్దలు వచ్చి మాట్లాడతారు అని ఈ సందర్భంగా వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమంచి వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే మరి.

More News

విడుద‌ల‌కు సిద్ధ‌మైన సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ 'బొంభాట్‌'

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై

చాగంటితో వివాదాలపై క్లారిటీ ఇచ్చుకున్న గరికపాటి!

తెలుగు రాష్ట్రాల్లో భక్తజన అభిమానాన్ని పొందిన ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తల్లో మొదట గుర్తొచ్చేది చాగంటి కోటేశ్వరరావు,

ప్రారంభమైన సందీప్ కిష‌న్ 'A1 ఎక్స్‌ప్రెస్‌'

నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

'తిప్ప‌రామీసం' సినిమాను అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి హీరో హీరోయిన్లుగా రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్ మరియు శ్రీ ఓం సినిమా బ్యాన‌ర్స్‌పై రిజ్వాన్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం

బిగ్ బాస్-3 ఫినాలేలో నాగ్ కంటే చిరునే హైలేట్!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 సీజన్.. జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమై నవంబర్-03తో ముగిసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ అంటే విన్నర్‌ ఎవరో ప్రకటించే రోజు మెగాస్టార్ చిరంజీవి