సోష‌ల్ మీడియాకు షాకిచ్చిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌

ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అంటే ట‌క్కున గుర్తుకొచ్చే పేరు ఆమిర్‌ఖాన్‌. ఈయ‌న పుట్టిన‌రోజు మార్చి 14. ఫ్యాన్స్‌, సెల‌బ్రిటీలంద‌రూ ఆమిర్‌ఖాన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లను సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. సినిమాల్లో ఏదో ఒక డిఫరెంట్‌గా ప్ర‌య‌త్నించే ఆమిర్‌.. లైఫ్‌లో ఎందుకు డిఫ‌రెన్స్ చూపించ‌కూడ‌ద‌ని అనుకున్నాడేమో. వెంట‌నే తాను అన్నీ సోష‌ల్ మీడియాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న‌ట్లు అధికారికంగా తెలియ‌జేశాడు. ఇది ఓ ర‌కంగా అభిమానుల‌కు పెద్ద షాకింగ్ విష‌యం. అస‌లు ఆమిర్ ఉన్న‌ట్లుండి ఇలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడ‌నేది ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు.

అయితే త‌న ప‌నిపై ఫోక‌స్ పెట్ట‌డానికే ఆమిర్‌ఖాన్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుని ఉంటాడ‌ని అంద‌రూ భావిస్తున్నారు. ‘‘న‌న్ను ఎంతో కాలంగా అభిమానిస్తున్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మీ ప్రేమ‌కు, ఆద‌ర‌ణ‌కు ధ‌న్య‌వాదాలు. నా హృద‌యం ప్రేమ‌తో నిండిపోయింది. ఇదే చివ‌రి సోష‌ల్ మీడియా పోస్ట్‌. ఎప్ప‌టిలాగానే నేను నాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఏకెపిపిఎల్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్ తెలియ‌జేస్తాను. ప్రేమతో మీ ఆమిర్‌ ఖాన్‌’’ అని ఆమిర్ ఖాన్ తన మెసేజ్‌లో‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలవుతుంది.

More News

'శాకుంత‌లం'లో క‌లెక్ష‌న్ కింగ్ విల‌క్ష‌ణ పాత్ర‌..!

గ‌త ఏడాది ‘ఓ బేబి’ స‌క్సెస్ త‌ర్వాత మ‌రో సినిమాలో మాత్రం ఇంత వ‌ర‌కు న‌టించ‌లేదు. మ‌ధ్య కోవిడ్ ఎఫెక్ట్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం అయ్యింది. అయితే మ‌ధ్య‌లో తెలుగు ఓటీటీ

తనయుడి సినిమా చూసి చిరు కళ్లలో ఉప్పొంగిన ఆనందం

పుత్రోత్సాహం ఎవరికైనా ఒకటే.. అది సామాన్యుడికైనా.. సెలబ్రిటీకైనా.. తన కుమారుడి సినిమా ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలన్న ఆతృత తండ్రికి ఉండటం సహజం.

సోషల్ మీడియా ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ కామరాజ్ హ్యాష్ ట్యాగ్

ఇటీవల జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ తనపై దాడి చేసినట్టు పేర్కొంటూ బెంగళూరుకు చెందిన హితేషా చంద్రానీ అనే మహిళ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

బర్త్‌డే సందర్భంగా 3 సినిమాలను అనౌన్స్ చేసిన ఆనంద్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఆనంద్ దేవరకొండ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలొడీస్ చిత్రాలతో కమర్షియల్

'హరిహర వీరమల్లు'... కాస్ట్యూమ్స్‌ ప్రత్యేకతలివే!

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, డైరెక్టర్‌ క్రిష్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'హరిహరవీరమల్లు'. ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ చకచకా జరుగుతోంది.