close
Choose your channels

తనయుడి సినిమా చూసి చిరు కళ్లలో ఉప్పొంగిన ఆనందం

Tuesday, March 16, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తనయుడి సినిమా చూసి చిరు కళ్లలో ఉప్పొంగిన ఆనందం

పుత్రోత్సాహం ఎవరికైనా ఒకటే.. అది సామాన్యుడికైనా.. సెలబ్రిటీకైనా.. తన కుమారుడి సినిమా ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలన్న ఆతృత తండ్రికి ఉండటం సహజం. అది కూడా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న సినిమా అయితే ఆ ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఈ క్రమంలోనే తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చూడాలని మెగాస్టార్ చిరంజీవి భావించారట. దీంతో రాజమౌళి దగ్గర తన రిక్వెస్టును పెట్టగా ఆయన ఓకే అనేసి ‘ఆర్ఆర్ఆర్’ను ఇటీవలఫ చిరుకి చూపించారట. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను రాజమౌళి ఆయనకు చూపించారని టాక్.

రషెస్ చూసి చిరు పొంగిపోయారని సమాచారం. రాజమౌళిని సైతం మెగాస్టార్ ప్రశంసలతో ముంచెత్తారట. ఈ సినిమా ‘బాహుబలి’ని సైతం మించిపోతుందంటూ తన సన్నిహితుల దగ్గర ఆనందాన్ని పంచుకున్నారని టాక్. ఫైనల్ మిక్సింగ్, ఆర్ఆర్ వంటివేం లేకుండా చూసే ఇంత హ్యాపీ ఫీలయితే.. ఇక పూర్తి సినిమా చూస్తే ఇంకెంత హ్యాపీ ఫీలవుతారోనని ‘ఆర్ఆర్ఆర్’ టీం భావిస్తోందట. నిజానికి సినిమా పూర్తవకుండా రషెష్ చూపించేందుకు దర్శకధీరుడు ఇష్టపడరట. కానీ మెగాస్టార్‌కు మాత్రం మినహాయింపును ఇచ్చేశారని సమాచారం. మొత్తానికి ఈ సినిమా చూశాక మెగాస్టార్‌లో పుత్రోత్సాహం పెల్లుబుకుతోందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.